IPL 2023: ఆర్చర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు.. గవాస్కర్ సీరియస్
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. కోట్లు కుమ్మరించి అతన్ని కొనుగోలు చేసినా.. అతడి వల్ల ముంబై ఇండియన్స్ కి ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అతడికి రూ.8 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని గవాస్కర్ పేర్కొన్నారు. గత సీజన్ మొత్తానికి దూరమైన అర్చర్.. ఈ ఏడాది లీగ్ మధ్యలోనే ముంబై జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్లో 5 మ్యాచులు ఆడినా అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ అతడి కోసం భారీగా ఖర్చు చేసిందని, అయితే లీగ్ మధ్యలోనే చికిత్స కోసం విదేశాలకు వెళ్లిపోయాడని, అతనికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ మధ్యలోనే నిష్క్రమించిన అర్చర్
ఎంతటి పెద్ద ప్లేయర్ అయినా ఐపీఎల్ సీజన్ కి అందుబాటులో లేకపోతే రూపాయి కూడా ఇవ్వకూడదని, దేశానికి ఆడాలా, ఐపీఎల్ ఆడాలా అన్నది ప్లేయర్ ఇష్టమని గవాస్కర్ అన్నారు. అయితే ఐపీఎల్ కాకుండా దేశానికి ఆడితే మంచిదేనని, కానీ ఐపీఎల్ ఎంచుకుంటే మాత్రం వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఈ సీజన్లో రెండు వికెట్లు తీసిన ఆర్చర్.. మే 9న గాయం తిరగబెట్టడంతో మే 9న అతను ఇంగ్లండ్ కు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ జోఫ్రా అర్చర్ తీరుపై మండిపడ్డాడు. ఇక లక్నో చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.