
IPL 2023: లక్నోపై ఓడిన ముంబై.. ఫ్లే ఆఫ్స్ కి ఛాన్సుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ కీలకమే.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఫ్లే ఆఫ్స్ అవకాశాలను కాస్త సంక్లిష్టంగా మార్చుకుంది.
పాయింట్ల పట్టికలో ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. ముంబై ఇండియన్స్ కి ఇంకా ఫ్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయో, లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్నోపై ముంబై గెలిచి ఉంటే ఆ జట్టు రెండోస్థానానికి చేరి ఉండేంది. అయితే చివరి ఓవర్లో మోసిన్ ఖాన్ దెబ్బకు ఎంఐ ఓడిపోవడంతో ఫ్లే ఆఫ్స్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ముంబై చివరి మ్యాచ్ ను వాంఖడేలో సన్ రైజర్స్ తో తలపడనుంది.
Details
సన్ రైజర్స్ పై గెలిస్తేనే ముంబైకి ఫ్లేఆఫ్స్ అవకాశం
ఎస్ఆర్‌హెచ్‌పై ముంబై గెలిస్తే నేరుగా ఫ్లే ఆఫ్స్ కి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తమ తర్వాతి రెండు మ్యాచులలో ఒకదాంట్లో ఓడినా.. నెట్ రన్ రేట్ చూడాల్సిన పని ఉండదు. అయితే ముంబైకి నెట్ రన్ రేట్ ఆర్సీబీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.
దీంతో సన్ రైజర్స్ పై ముంబై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆర్సీబీ తన రెండు మ్యాచ్ లను గెలిస్తే మాత్రం ఆ జట్టు 16 పాయింట్లతో మెరుగైన నెట్ రన్ రేట్ తో నిలుస్తుంది.
ఆర్సీబీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఫ్లేఆఫ్స్ కి చేరాలంటే ఎస్ఆర్‌హెచ్‌పై ముంబై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.