Loading...
India A vs Pakistan A: హర్షిత్‌ రాణాతో పాక్‌ ఆటగాడి వాగ్వాదం.. వైరల్‌గా మారిన వీడియో!
హర్షిత్‌ రాణాతో పాక్‌ ఆటగాడి వాగ్వాదం.. వైరల్‌గా మారిన వీడియో!

India A vs Pakistan A: హర్షిత్‌ రాణాతో పాక్‌ ఆటగాడి వాగ్వాదం.. వైరల్‌గా మారిన వీడియో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత 'ఎ' జట్టుకు పాకిస్థాన్‌ 'ఎ' చేతిలో ఓటమి ఎదురైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఇరు జట్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకునేలా వ్యవహరించారు. తొలుత పాక్‌ బ్యాటర్లను ఔట్‌ చేసినప్పుడు భారత బౌలర్‌ హర్షిత్‌ రాణా సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో పాక్‌ ఆటగాడు సుఫియాన్‌ కాస్త అతిగా ప్రవర్తించాడు. రాణాను దూషించడంతోపాటు అతడి మీదకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే పాక్‌ బౌలర్‌ అలీ రజా జోక్యం చేసుకుని తన సహచరుడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లాడు.

వివరాలు

నెట్టింట విమర్శలు..

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో వికెట్లు తీసినప్పుడు, సెంచరీలు సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడం సహజం.

ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా దానికి ఓ పరిధి ఉండాలి. అయితే భారత్‌తో మ్యాచ్‌ అంటే పాక్‌ ఆటగాళ్ల అత్యుత్సాహం మరింత ఎక్కువవుతోందని నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల అండర్‌-19 ఆసియా కప్‌, అంధుల ఆసియా కప్‌లో ఆ జట్టు వ్యవహరించిన తీరును క్రీడాలోకం గమనించింది.

అండర్‌-19 ఆసియా కప్‌ లీగ్‌ దశలో భారత్‌పై విజయం సాధించగానే పాక్‌ ఆటగాళ్లు అతిగా సంబరాలు చేసుకున్నారు.

ఇక అంధుల ఆసియా కప్‌ విషయంలోనూ వివాదం చోటుచేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయినప్పటికీ పాక్‌ జట్టు కప్పును ఎత్తుకెళ్లడంతో విమర్శలు ఎదుర్కొంది.

వివరాలు

'షేక్‌హ్యాండ్స్‌' వివాదంపై స్పందించిన ఎంసీసీ

తాజాగా రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లోనూ తొలి నుంచీ పాక్‌ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది.

ఒకవేళ భారత్‌, పాక్‌ జట్లు ఫైనల్‌కు చేరుకుంటే ఇరు జట్ల మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతుందని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లోనూ భారత్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. టాస్‌ సమయంలోనే కాకుండా మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

ఈ పరిణామం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) స్పందించింది.

ADVERTISEMENT

వివరాలు

పైస్థాయి నుంచి ఆదేశాలొచ్చాయి

కరచాలనం విషయంలో పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ, దానిని నియంత్రించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది.

''షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకోవాలని మేమూ కోరుకుంటాం. అయితే, అంతకంటే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని మాకు తెలుసు.

అసలు అది మా నియంత్రణలో లేని అంశమని ఎంసీసీ ప్రతినిధి ఫ్రేజర్‌ స్టీవర్ట్‌ పేర్కొన్నారు

ADVERTISEMENT