సిక్స్ ప్యాక్ లుక్‌లో అర్జున్ టెండూల్కర్ అదరహో..
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేసేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి యువ క్రికెటర్లు కూడా రాబోతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా సిక్స్ ప్యాక్ బాడిని ఒకప్పుడు ప్రదర్శించారు. వీరి జాబితాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ జాబితాలో చేరిపోయాడు. సాధారణంగా అర్జున్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనపడుతూ ఉంటాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ చొక్కా లేకుండా ఉండే ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో అర్జున్ టెండూల్కర్ సిక్స్ బాడీ చూసిన నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లను పెడుతున్నారు.
తండ్రి రికార్డును సమం చేసిన అర్జున్ టెండూల్కర్
ఈ నెల రంజీ ట్రోఫీలో గోవా తరఫున అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలోనే సెంచరీ చేసి తన తండ్రి సచిన్ రికార్డును సమం చేశాడు. సచిన్ కూడా తన రంజీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించడం గమనార్హం. అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి తన కెరీర్ను ప్రారంభించాడు. అక్కడ అవకాశాలు లేకపోవడంతో గోవాకు వెళ్లిపోయాడు. అర్జున్‌కి గోవా నుంచి అవకాశాలు వచ్చింది. దీంతో తన టాలెంట్‌ను ప్రస్తుతం అభిమానులకు చూపుతున్నాడు. యోగరాజ్ సింగ్, అర్జున్ టెండూల్కర్ కొన్ని సూచనలను చేశారు. సచిన్ టెండూల్కర్ కుమారుడన్న విషయాన్ని రాబోయే 15 రోజులు మర్చిపోవాలన్నారు. తండ్రి నీడ నుంచి బయటకు రావాలన్నారు. అర్జున్ బ్యాటింగ్ లో కూడా సత్తా చాటగలడని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.