Lionel Messi: కోల్‌కతాలో లియోనెల్ మెస్సీ 70 అడుగుల విగ్రహా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత్ సందర్శనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కోల్‌కతా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని లేక్ టౌన్ దగ్గర సుమారు 70 అడుగుల ఎత్తులో మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ ఈ అర్జెంటీనా సూపర్‌స్టార్ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. ఈ విగ్రహంలో మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని చేతిలో పట్టుకుని ఉన్న పోజ్‌లో కనిపించనున్నాడు. మాంటీ పౌల్స్ నేతృత్వంలోని బృందం విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతోంది.
Details
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం
'GOAT Tour'లో భాగంగా మెస్సీ భారత దేశానికి రానుండగా, కోల్‌కతా తర్వాత ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో కూడా పాల్గొననున్నారు. లేక్ టౌన్ వద్ద ఇనుముతో భారీ విగ్రహం నిర్మించగా, అక్కడ మెస్సీ కుటుంబ సభ్యుల కటౌట్లు, స్టాచ్యూలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెస్సీ విగ్రహం అని బెంగాల్ మంత్రి ప్రకటించారు.