Arshdeep Singh: టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర.. 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టడంతో అర్ష్‌దీప్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనతతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అర్ష్‌దీప్ కంటే ముందుగా రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్, ఎహసాన్ ఖాన్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, వనిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆడమ్ జంపా మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో 150వికెట్ల మార్కును అందుకున్నారు.
వివరాలు
అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 120 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) - 153 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు
ఎహసాన్ ఖాన్ (హాంగ్‌కాంగ్) - 119 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు
ఇష్ సోధీ (న్యూజిలాండ్) - 142 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) - 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు
వనిందు హసరంగ (శ్రీలంక) - 101 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు
ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్) - 130 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 118 మ్యాచ్‌ల్లో 153 వికెట్లు
అర్ష్‌దీప్ సింగ్ (భారత్) - 103 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు