Arshdeep Singh : టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న అర్షదీప్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, దేశవాళీ టీ20లను కలిపి మొత్తం 250 వికెట్లు పూర్తి చేసిన కొద్దిమంది బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జాన్ ఫ్రైలింక్ వికెట్ తీసి తన 250వ వికెట్ నమోదు చేశాడు. అర్షదీప్ కెరీర్ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8కు పైగా ఉంది. తన టీ20 ప్రయాణంలో ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు.
Details
మ్యాచ్ విశేషాలు
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి విధ్వంసకర అర్ధ సెంచరీలతో జట్టుకు బలమైన స్కోర్ అందించారు. సంజూ శాంసన్ 8 బంతుల్లో 22 పరుగులు (ఒక ఫోర్, మూడు సిక్సర్లు) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 21 బంతుల్లో 25 పరుగులు (3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 12 పరుగులు (ఒక సిక్స్) ఆచితూచి ఆడారు.
Details
నిరాశపరిచన రింకూ సింగ్
శివమ్ దూబే 16 బంతుల్లో 23 పరుగులు (ఒక ఫోర్, ఒక సిక్స్) చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో రింకూ సింగ్ 6 బంతుల్లో కేవలం 1 పరుగే చేసి నిరాశపరిచాడు. అక్షర్ పటేల్ తొలి బంతికే ఔటయ్యాడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌట్ కాగా, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. రూబెన్ ట్రంపెల్మన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) పర్వాలేదనిపించారు. స్మిట్ (4-0-50-1), బెర్నార్డ్ స్కోల్జ్ (4-0-41-1)పై భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు.