LOADING...
Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డు.. టీ20లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్
అర్ష్‌దీప్ సింగ్ రికార్డు.. టీ20లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్

Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డు.. టీ20లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో భారత్ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఘన రికార్డు స్థాపించాడు. ఒక వికెట్ పడగొట్టి, అంతర్జాతీయ టీ20ల్లో వందవ వికెట్‌ను సాధించి, భారత్ తరపున ఈ ఘనతను సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అబుదాబిలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా ఒమన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా 93 పరుగుల భాగస్వామ్యంతో జట్టును బలంగా ఎదుర్కొన్నా, విజయం సాధించలేకపోయారు.

Details

వంద వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు

ఈ ఘనతతో అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మైల్‌స్టోన్‌ను అతను కేవలం 64 మ్యాచ్‌ల్లోనే చేరుకున్నాడు. ప్రపంచ స్థాయిలో అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (53 మ్యాచ్‌లు) వద్ద ఉంది. ఆ తర్వాత శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ (63 మ్యాచ్‌లు), అర్ష్‌దీప్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హారిస్ రౌఫ్ (71 మ్యాచ్‌లు) మరియు ఐర్లాండ్‌కు చెందిన మార్క్ అడైర్ (72 మ్యాచ్‌లు) ఈ జాబితాలో ఉన్నాయి.

Details

జ‌స్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్

మ్యాచ్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో హర్షిత్ రాణా, జ‌స్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ఒక్కొక్క వికెట్ తీశారు. ఇది భారత జట్టుకు 250వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. టోర్నమెంట్‌లో టైటిల్ కోసం అడుగుపెట్టిన భారత్‌కు ఆరంభం బలంగా లభించింది. తొలి మ్యాచ్‌లో UAEని 9 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి, భారత్ సూపర్ ఫోర్ దశకు చేరుకుంది.