Page Loader
'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు
పాక్ స్పిన్నర్ కనేరియా

'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2022
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను 3-0 తేడాతో పాక్ ఓడిపోయింది. ప్రస్తుతం బాబార్ అజామ్ నాయకత్వంపై విమర్శలు వర్షం కురిస్తోంది. ఓటమికి బాబరే కారణంగా పాక్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా అతడి యూట్యూబ్‌ ఛానెల్‌లో బాబార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''భవిష్యత్తులో పాకిస్థాన్‌ పర్యటించే జట్టు దయచేసి వారి 'ఎ' జట్టును తీసుకొని రావద్దు. మీరు మీ 'సి' జట్టును తీసుకొని రండి. అప్పుడైన మేము కష్టపడి గెలిచే అవకాశం ఉంటుందేమో'' ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అండర్‌-19 పిల్లలను ఆడిస్తే.. వారు ఓడిపోయినా బాధ ఉండదు'' అని కనేరియా మండిపడ్డాడు. జట్టులో ఎవరి స్వార్థ్యం వారు చూసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.

పాకిస్తాన్

కెప్టెన్‌గా బాబర్ పెద్ద సున్నా

కెప్టెన్‌గా బాబర్ పెద్ద సున్నా అన్న కనేరియా.. అతణ్ని విరాట్ కోహ్లితో పోల్చడం మానేయాలని పాకిస్థానీలకు సూచించాడు. కోహ్లి, రోహిత్‌తో పోల్చదగ్గ ఆటగాళ్లు పాక్ జట్టులో ఎవరూ లేరన్నాడు. బాబర్ ఇక మీదట టెస్టుల్లో ఆడకపోవడం ఉత్తమం అని కూడా మాజీ క్రికెటర్ సలహా ఇచ్చాడు. మరోవైపు టీమిండియా గత 10 ఏళ్లలో సొంత గడ్డ మీద 42 మ్యాచ్‌లు ఆడి రెండు టెస్టుల్లో మాత్రమే ఓడింది. పాకిస్థాన్ 11 టెస్టులే ఆడినప్పటికీ నాలుగింట్లో ఓడిపోయింది. అందుకే కోహ్లితో బాబర్‌ను పోల్చొద్దని కనేరియా సూచించాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన తొలి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కావడం గమనార్హం. అందుకే కనేరియా బాబర్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.