
అర్ష్‌దీప్‌పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ అర్ష్ దీప్ నోబాల్స్ పై టీమిండియా మాజీ ప్లేయర్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ 5 నోబాల్స్ వేసి ఓ చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే.
టీ20 సిరీస్‌ను పూణేలోనే టీమిండియా సొంతం చేసుకుంటుందని ఆశించిన ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశే మిగిలింది. బ్యాటింగ్, బౌలింగ్ విఫలమైన టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అక్షర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు.
గవాస్కర్
ప్రొఫెషనల్స్ ఇలా చేయరు: గవాస్కర్
ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్ వరుసుగా మూడు నోబాల్స్ వేయడం అందరిని అశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్లో ఏ ఇండియన్ బౌలర్ వరుసగా మూడు నోబాల్స్ వేయలేదు.
హార్ధిక్ పాండ్యా నో బాల్స్ వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మాజీ క్రికెటర్ గవాస్కర్ స్పందించారు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ గట్టిగానే విమర్శించాడు. ఈ మధ్య కాలంలో ప్లేయర్లు నియంత్రణల్ లేరని, కచ్చితంగా ఇది బౌలర్ తప్పిదమే అని చెప్పాడు.