Loading...
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్‌.. ఈ రికార్డులు చూస్తే 'రారాజు' అనాల్సిందే!
27వ ఏట అడుగుపెట్టిన గిల్‌.. ఈ రికార్డులు చూస్తే 'రారాజు' అనాల్సిందే!

Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్‌.. ఈ రికార్డులు చూస్తే 'రారాజు' అనాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ సెప్టెంబర్‌ 8న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా నుంచి క్రికెట్‌ ప్రయాణాన్ని ప్రారంభించిన గిల్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు ఏకంగా టీమ్‌ఇండియాను నడిపించే స్థాయికి చేరుకున్నాడు. అతడి క్రికెట్‌ ప్రయాణం ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

వివరాలు

అండర్‌-19 సంచలనం నుంచి గాబ్బా హీరోగా..

1999 సెప్టెంబర్‌ 8న జన్మించిన శుభ్‌మన్‌ గిల్‌.. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచి తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

2019లో వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ అతడి కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది.

మెల్‌బోర్న్‌లో అరంగేట్ర టెస్టులోనే ఆకట్టుకున్న గిల్‌.. సిడ్నీ టెస్టులో అర్ధ శతకం సాధించాడు.

ఆ తర్వాత చారిత్రాత్మక గాబ్బా టెస్టులో 91 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వివరాలు

అతి పిన్న వయసులో డబుల్‌ సెంచరీ..

వన్డే ఫార్మాట్‌లోనూ శుభ్‌మన్‌ గిల్‌ అనేక అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 2,000, 2,500 పరుగుల మైలురాళ్లను చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే న్యూజిలాండ్‌పై 149 బంతుల్లో 208 పరుగులు బాదాడు. తద్వారా వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో 350కిపైగా పరుగులు చేసిన గిల్‌.. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత జట్టులోనూ కీలక సభ్యుడిగా ఉన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ఇంగ్లండ్‌లో చారిత్రక రికార్డు..

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత 2025 ఇంగ్లండ్‌ పర్యటన నుంచి శుభ్‌మన్‌ గిల్‌ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా 75.40 సగటుతో ఏకంగా 754 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ పరుగుల్లో నాలుగు సెంచరీలు ఉండగా.. అతడి అత్యుత్తమ స్కోరు 269. టెస్టు సిరీస్‌లో ఒక కెప్టెన్‌ సాధించిన రెండో అత్యధిక పరుగుల రికార్డు ఇది.

ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మాన్‌ 810 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. గిల్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఆ పర్యటనలో భారత్‌ 2-2తో సిరీస్‌ను సమం చేయడంలో గిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ భారత జట్టును 1-0తో విజేతగా నిలిపాడు.

ADVERTISEMENT

వివరాలు

మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న గిల్‌..

మరోవైపు ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా రాణిస్తున్న గిల్‌.. 2026 సీజన్‌లో 732 పరుగులతో టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.

ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌.. 43.47 సగటుతో 3,043 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 9 అర్ధ శతకాలున్నాయి.

వన్డేల్లో అతడి గణాంకాలు మరింత అద్భుతంగా ఉన్నాయి. 67 వన్డేల్లో 60.33 సగటుతో 3,379 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 20 అర్ధ శతకాలు ఉన్నాయి.

టీ20 ఫార్మాట్‌లో 36 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 138.59 స్ట్రైక్‌రేట్‌తో 869 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

ADVERTISEMENT