Page Loader
Australian Open: 43 ఏళ్ళ వయస్సులో చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు 
43 ఏళ్ళ వయస్సులో చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు

Australian Open: 43 ఏళ్ళ వయస్సులో చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2024
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న బుధవారం పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్ప‌న్న నిలవనున్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల డబుల్స్‌లో బొప్పన, మాథ్యూ ఎబ్డెన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని పొందడం ఖాయం అయింది. రోహన్ బోపన్న వయస్సుతో పాటు ఆటలో కూడా మెరుగవుతున్నాడు, రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెరీర్-అత్యున్నత ర్యాంకింగ్ నంబర్. 3తో ప్రవేశించాడు. ఇప్పుడు సెమీస్‌లోకి ప్ర‌వేశించిన నేప‌థ్యంలో.. వ‌చ్చే వారం రిలీజ్ చేసే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 నిలవనున్నాడు.

Details 

తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్ను 

రోహన్ బోపన్నకు అత్యంత విజయవంతమైన భాగస్వాములలో ఒకరైన మాథ్యూ ఎబ్డెన్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2 స్థానానికి చేరుకోవడం ఖాయం. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ 6వ సీడ్ మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెని జంటను గంటా 46 నిమిషాల్లో ఓడించారు. ఇక సెమీ ఫైనల్‌లో రెండో సీడ్ బోపన్న, ఎబ్డెన్‌లు అన్‌సీడెడ్‌ టోమస్‌ మచాక్‌, జిజెన్‌ జాంగ్‌తో తలపడతారు. బోపన్న జోడి తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్నేశారు.