ఆష్లీగ్ గార్డనర్ జోరు.. ఆల్ రౌండర్లలో మొదటి ర్యాంకు
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీగ్ గార్డనర్ ఐసీసీ ఉమెన్స్ ర్యాంకులో సత్తా చాటింది. ఆలౌ రౌండర్లలో జాబితాలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఇటీవల భారత్ మహిళ టీ20 మ్యాచ్ లో 32 బంతుల్లో 66 పరుగులు చేసింది.అనంతరం రెండు వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చింది. ముందుగా ఆలౌ రౌండర్ జాబితాలో కివీ సోఫీ డివైన్ మొదటి స్థానంలో ఉండగా.. గార్డనర్ రెండు స్థానాలు ఎగబాకి మొదటి స్థానానికి చేరుకుంది. గార్డన్ (417) పాయింట్లతో మొదటి స్థానం, డివైన్ (389) పాయింట్లతో రెండో స్థానం, దీప్తి శర్మ (387) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. హేలీ మాథ్యూస్ నాలుగోస్థానం, అమీలియా ఐదోస్థానంలో నిలిచింది.
మూడోస్థానంలో స్మృతి మంధాన
బ్యాటింగ్ ర్యాకింగ్లో మెక్ గ్రాత్(814) పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. బెత్మూనీ (760) రెండోస్థానం నిలిచింది. INDWపై 57.50 వద్ద 115 పరుగులు చేసిన గార్డనర్ (649) పాయింట్లతో ఏడో ర్యాంకులో కొనసాగుతోంది. శ్రీలంకకు చెందిన చమరి అతపత్తు (612) పాయింట్లతో టాప్ 10లోకి దూసుకెళ్లింది. టీఇండియాకు చెందిన స్మృతి మంధాన 727 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన జెమిమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు (607) దిగజారి 12వ స్థానానికి చేరుకుంది.