
Abhishek Sharma: చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ.. సనత్ జయసూర్య ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 టోర్నీ సూపర్-4 దశలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన శక్తివంతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాడు. తనదైన శైలిలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతను 37 బంతుల్లో 75 పరుగులు సంపాదించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సులు బాదాడు. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 మొదటి రోజు నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. ఈక్రమంలో అభిషేక్ శర్మ బంగ్లాదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు
వివరాలు
అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు
ఈ మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు స్థాపించాడు. ఇంతకంటే ముందు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) పేరున ఉండేది. ఆ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో 75 పరుగులు చేయగా,మొత్తం ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో అతను 248 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ మొత్తం విజయాల్లో అతను 24 ఫోర్లు,17 సిక్సులు బాదాడు. గతంలో 2008 ఆసియా కప్‌లో సనత్ జయసూర్య 14 సిక్సులతో ఈ రికార్డును నెలకొల్పారు.
వివరాలు
17 సిక్సులతో అగ్రస్థానంలో అభిషేక్ శర్మ
ఆ రికార్డు 17 ఏళ్ల కాలం పాటు నిలిచింది, కానీ అభిషేక్ శర్మ అది అధిగమించటం ద్వారా గత 17ఏళ్లుగా చెక్కచెదరకుండా ఉన్న రికార్డును అధిగమించాడు. సిక్సుల పరంగా టాప్ ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ 17 సిక్సులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సనత్ జయసూర్య 14 సిక్సులు, రోహిత్ శర్మ 13 సిక్సులు, షాహిద్ అఫ్రిది, రెహ్మనుల్లా గుర్బాజ్ ఇద్దరూ 12 సిక్సులతో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
17 సిక్సులతో అగ్రస్థానంలో అభిషేక్ శర్మ
- 5 Innings.
— Johns. (@CricCrazyJohns) September 24, 2025
- 248 Runs.
- 49.60 Average.
- 206.66 Strike Rate
- 2 Fifties.
- 23 fours.
- 17 Sixes.
ABHISHEK SHARMA IN ASIA CUP 2025 🤯 pic.twitter.com/fZ85DFffrY