LOADING...
Asia Cup: ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే! 
ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే!

Asia Cup: ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025కి ముందస్తుగా టీవీ, డిజిటల్ ప్రకటనల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా భారత జట్టు, పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా యాడ్స్‌కు డిమాండ్ మరింత తీరకు చేరింది. ఎకనామిక్ టైమ్స్ సమాచారం ప్రకారం, ఈ టోర్నమెంట్ మీడియా రైట్స్‌ను 2031 వరకు కలిగిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) భారత్ మ్యాచ్‌ల కోసం 10 సెకన్ల టీవీ యాడ్ రేటును రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేస్తోంది.

Details

ఆసియా కప్ 2025 టీవీ ప్రకటనల ప్యాకేజీలు 

కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీ: రూ. 18 కోట్లు అసోసియేట్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీ: రూ. 13 కోట్లు స్పాట్-బై ప్యాకేజీ (భారత్ + ఇతర మ్యాచ్‌లు): రూ. 16 లక్షలు / 10 సెకన్లు మొత్తం ప్యాకేజీ విలువ: రూ. 4.48 కోట్లు వరకు

Details

డిజిటల్ ప్రకటనల రేట్లు (Sony LIV)

కో-ప్రెజెంటింగ్ & హైలైట్స్ పార్ట్‌నర్: రూ. 30 కోట్లు ఒక్కొక్కటి కో-పవర్డ్ బై ప్యాకేజీ: రూ. 18 కోట్లు భారత్ మ్యాచ్‌ల కోసం డిజిటల్ యాడ్స్‌లో 30 శాతం రిజర్వ్ ప్రీ-రోల్ యాడ్స్: ₹275 (భారత్ మ్యాచ్‌లకు ₹500, భారత్ vs పాకిస్తాన్ రూ. 750) మిడ్-రోల్ యాడ్స్: ₹225 (భారత్ మ్యాచ్‌లకు ₹400, భారత్ vs పాకిస్తాన్ ₹600) కనెక్టెడ్ TV యాడ్స్: ₹450 (భారత్ మ్యాచ్‌లకు ₹800, భారత్ vs పాకిస్తాన్ ₹1,200)

Details

భారత్ జట్టు ఆసియా కప్ 2025 షెడ్యూల్

సెప్టెంబర్ 10: భారత్ vs యుఏఈ (దుబాయ్) సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్) సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)

Details

ఆసియా కప్ 2025 గ్రూపులు, మ్యాచ్‌ల వివరాలు 

మొత్తం 8 జట్లు పాల్గొంటాయి; 19 మ్యాచ్‌లు జరుగుతాయి గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ గ్రూప్ B: శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి సూపర్ 4లో ప్రతి జట్టు మిగతా 3 జట్లతో మ్యాచ్ ఆడుతుంది టాప్ 2 జట్లు ఫైనల్‌కు చేరతాయి గ్రూప్ Bకి చెందిన 6 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు, గ్రూప్ Aకి చెందిన 2 మ్యాచ్‌లు అబుదాబిలో ఉంటాయి భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్, 5 సూపర్ ఫోర్ మ్యాచ్‌లు, ఫైనల్ (సెప్టెంబర్ 28, దుబాయ్) ప్రత్యేక షెడ్యూల్