
Asia Cup : ఆసియాకప్ 2025.. భారత్-పాక్ మ్యాచ్‌కు అంపైర్లు ఫిక్స్.. ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ టోర్నీకి మ్యాచ్ రిఫరీలుగా అనుభవజ్ఞులైన రిచీ రిచర్డ్సన్, ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించనున్నారు.
Details
గ్రూప్ దశ మ్యాచ్‌లకు అంపైర్లు
భారత్ నుంచి వీరేంద్ర శర్మ, రోహన్ పండిట్, శ్రీలంకకు చెందిన రవీంద్ర విమలసిరి, రుచిరా పల్లియాగురుగే అఫ్గానిస్థాన్ నుంచి అహ్మద్ పక్తీన్, ఇజతుల్లా సఫీ, పాకిస్థాన్ నుంచి ఆసిఫ్ యాకూబ్, ఫైసల్ అఫ్రిది, బంగ్లాదేశ్‌కు చెందిన గాజీ సోహెల్, మసుదుర్ రెహ్మాన్ వంటి అంపైర్లు గ్రూప్ దశ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
Details
భారత్ - పాక్ మ్యాచ్ అంపైర్ల జాబితా
సెప్టెంబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి ప్రత్యేక అంపైర్లను ఐసీసీ నియమించింది. ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా శ్రీలంకకు చెందిన రుచిరా పల్లియగురుగే, బంగ్లాదేశ్‌కు చెందిన మసుదుర్ రెహ్మాన్ బాధ్యతలు చేపడతారు. టీవీ అంపైర్‌గా అఫ్గానిస్థాన్‌కు చెందిన అహ్మద్ పక్తీన్, ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ ఉంటారు. మ్యాచ్ రిఫరీగా జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరిస్తారు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు రుచిరా, రెహ్మాన్‌లకు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉంది. రుచిరా 160కి పైగా, రెహ్మాన్ 70కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ల్లో అంపైర్లపై ఎప్పుడూ భారీ ఒత్తిడి ఉంటుందన్నది తెలిసిందే. చిన్నతరహా తప్పు నిర్ణయాలు తీసుకున్నా కూడా తీవ్ర విమర్శలు తప్పవు.