LOADING...
U-19 Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌.. టీమిండియా ముందు భారీ లక్ష్యం 
ఆసియా కప్ ఫైనల్‌.. టీమిండియా ముందు భారీ లక్ష్యం

U-19 Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌.. టీమిండియా ముందు భారీ లక్ష్యం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్‌-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ ఫైనల్‌ (U-19 Asia Cup Final)లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) తలపడుతున్నాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సమీర్ మిన్హాస్ అసాధారణ ప్రదర్శనతో మెరిశాడు. 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 172 పరుగులు చేసి భారీ శతకం సాధించాడు. అతడికి అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మంచి మద్దతు అందించాడు.

Details

3 వికెట్లు పడగొట్టిన దీపేశ్ దేవేంద్రన్ 

ఇక ఉస్మాన్ ఖాన్ 35, ఫర్హాన్ యూసుఫ్‌ 19, హంజా జహూర్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే హంజా జహూర్‌ను హెనిల్ పటేల్ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ 79 బంతుల్లో 92 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించింది. ఉస్మాన్ ఖాన్‌ను ఖిలాన్ పటేల్ ఔట్ చేశాడు. తర్వాత అహ్మద్ హుస్సేన్‌తో కలిసి సమీర్ మిన్హాస్ నిలకడగా పరుగులు రాబట్టాడు. ఈ ద్వయం 125 బంతుల్లో 137 పరుగులు జోడించింది.

Details

చివర్లో భారీగా పరుగులు సాధించిన పాక్

హుస్సేన్‌ను కూడా ఖిలాన్ పటేల్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. హుస్సేన్ ఔటైన తర్వాత సమీర్ తన దూకుడును మరింత పెంచాడు. దీపేశ్ వేసిన 43వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది మ్యాచ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అయితే అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కాన్షిక్ చౌహాన్‌కు క్యాచ్ ఇచ్చి సమీర్ మిన్హాస్ ఔటయ్యాడు. అప్పటికి పాకిస్థాన్ స్కోరు 302/4గా ఉంది. చివరి ఏడు ఓవర్లలో పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 45 పరుగులు మాత్రమే జోడించగలిగింది. దీంతో ఫైనల్‌లో భారత్ ముందు 348 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

Advertisement