
ఆసియా కప్: ఆరు వికెట్లతో చరిత్ర సృష్టించిన సిరాజ్, 35ఏళ్ళ రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో అద్భుతం జరిగింది. శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ పోరులో భారతదేశం విజయకేతనాన్ని ఎగరవేసింది.
ఈ మ్యాచులో తన అద్భుతమైన బౌలింగ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు మహమ్మద్ సిరాజ్. ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకను 50పరుగులకే కట్టడి చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది మహమ్మద్ సిరాజ్.
సిరాజ్ వేసిన రెండవ ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి భారత ఆటగాడిగా మహమ్మద్ సిరాజ్ రికార్డు నెలకొల్పాడు.
Details
35ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్
అంతేకాదు, మహమ్మద్ సిరాజ్ తన కెరీర్లో 50వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ మ్యాచుల్లో 50వికెట్లు పడగొట్టిన నాలుగవ భారత ఆటగాడిగా మహమ్మద్ సిరాజ్ రికార్డు నెలకొల్పాడు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఆసియా కప్ చరిత్రలో అతి తక్కువ పరుగులు ఇచ్చి అతి ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు.
అంతకుముందు 1988వ సంవత్సరంలో అర్షద్ ఆయూబ్ అనే భారత బౌలర్, పాకిస్తాన్ పై 9 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
ఇప్పుడు ఆ రికార్డును మహమ్మద్ సిరాజ్ బద్దలు కొట్టాడు. ఫైనల్ మ్యాచులో 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.