లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్
లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్ కలిస్ 54 బాల్స్ లో 78 పరుగులు చేసి విజృంభించాడు. రాస్ టేలర్ 32 పరుగులు ఫర్వాలేదనిపించాడు. ఆసియా లయన్స్ బౌలర్లలో అబ్దుల్ రజాక్ రెండు వికెట్ల తీసి సత్తా చాటాడు. లక్ష్య చేధనకు దిగిన ఆసియా లయన్స్ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. ఓపెనర్లు ఉపల్ తరంగ, దిల్షాన్ హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్‌గా రాబిన్ ఊతప్ప
తరంగ, దిల్షాన్ చెలరేగడంతో ఆసియా లయన్స్ సునాయాసంగా మ్యాచ్ ను గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అబ్దుల్ రజాక్ పొందగా.. ఉపల్ తరంగ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన ఆసియా లయన్స్ రెండు కోట్లు, రన్నరప్ అయిన వరల్డ్ జెయింట్స్ కు కోటి రూపాయాలు ప్రైజ్ మనీ దక్కినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ గా రాబిన్ ఉతప్ప రికార్డు సృష్టించాడు. 173.41 స్టైక్ రైట్‌తో రాబిన్ ఉతప్ప బ్యాటింగ్ చేశాడు. అదే విధంగా మూడు హఫ్ సెంచరీలతో గౌతమ్ గంభీర్, ఉపల్ తరంగ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లగా నిలిచారు.