Page Loader
ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్
జాతీయ జెండాపై సంతకం చేస్తున్న షాహిద్ ఆఫ్రిది

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆసియా లయన్స్ టీమ్‌కు షాహిద్ ఆఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శనివారం ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్ మధ్య జరిగిన మ్యాచ్ లో షాహిద్ ఆఫ్రిది చేసిన పనికి నెజినట్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.

షాహిద్ ఆఫ్రిది

ఇండియా మహరాజాస్‌పై ఆసియా లయన్స్ విజయం

మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన బస్ వైపు షాహిద్ ఆఫ్రిది వెళుతున్న సమయంలో ఓ అభిమాని ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆ అభిమాని కోరకను తీర్చి ఇండియా జెండాపై షాహిద్ అఫ్రిది సంతకం చేసి ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. మ్యాచ్ విషయానికొస్తే ఇండియా మహరాజాస్‌పై 85 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ విజయాన్ని సాధించింది.