AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ జట్టు ఖరారు.. కమిన్స్ రీఎంట్రీ.. సీనియర్ ప్లేయర్ కి మెండిచేయి
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరుగుతుంది. ఈ టెస్టుకు ఒక రోజు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టుల నుంచి దూరమైన రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్-రౌండర్ మైఖేల్ నేసర్, సీమర్ బ్రెండన్ డాగెట్ జట్టులో చోటు కోల్పోయారు. వెన్నుగాయం నుంచి కోలుకున్నప్పటికీ ఉస్మాన్ ఖవాజా జట్టులో చోటు పొందలేకపోయాడు. కాబట్టి ట్రావిస్ హెడ్ మళ్ళీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
Details
సిరీస్ పై కన్నేసిన ఆసీస్
అతడికి జోడీగా జేక్ వెదరాల్డ్ మరొక ఓపెనర్‌గా మైదానంలోకి రానున్నారు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆసీస్ మూడో టెస్టులోనూ గెలిచి, సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచి, ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించాలని యత్నిస్తోంది. ఆసీస్ జట్టు ఇదే ట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, లబుషేన్, స్మిత్, గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. ఇంగ్లాండ్ జట్టు ఇదే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్, జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.