The Ashes 2025-26: 132 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. ఇంగ్లండ్ విజయ లక్ష్యం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. రెండో రోజు ఆటను 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన ఆసీస్ జట్టు, 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటర్ల మధ్య పెద్ద భాగస్వామ్యాలు ఏర్పడకపోవడంతో వికెట్లు వరుసగా కూలిపోయాయి. ఫలితంగా ఆస్ట్రేలియా 34.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లాండ్‌కు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(46; 67 బంతుల్లో 4ఫోర్లు) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. స్టీవ్ స్మిత్ 24* (39 బంతుల్లో 1 ఫోర్)తో చివరివరకు నాటౌట్‌గా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు.అయితే మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు.
Details
మ్యాచ్ రెండ్రోజుల్లో ముగిసే అవకాశం
స్కాట్ బోలాండ్ 6, జేక్ వెదర్లాడ్ 5, లబుషేన్ 8, ఉస్మాన్ ఖవాజా 0, కామెరూన్ గ్రీన్ 19, మైఖేల్ నీసర్ 0, మిచెల్ స్టార్క్ 0, రిచర్డ్‌సన్ 7 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి అవుట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్ 4 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2, గస్ అట్కిన్సన్ 1 వికెట్ తీసుకున్నారు. నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలోనే మొత్తం 20 వికెట్లు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పిచ్ పరిస్థితులను బట్టి మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి