తదుపరి వార్తా కథనం
AUS vs ENG : 82 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్.. యాషెస్ సిరీస్ కైవసం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 21, 2025
09:46 am
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో పాటు వరుసగా మూడో టెస్టులోనూ గెలుపొందిన ఆసీస్, యాషెస్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో చివరి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, తీవ్రంగా పోరాడినా చివరకు 352 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌లలో 371, 379 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు వరుసగా 286, 352 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో మూడో టెస్ట్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా, యాషెస్‌పై మరోసారి పట్టు సాధించింది.