తాలిబన్ల ఎఫెక్టుతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
యూఏఈలో మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది. బాలికలు, మహిళల విద్య, ఉపాధిపై తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో సిరీస్ నుంచి వైదొలిగిన ఆసీస్ జట్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం మార్చి చివర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు కీలక పాయింట్లను కోల్పోనుంది. మ్యాచ్ కి పది చొప్పున 39 పాయింట్లు ఆప్ఘన్ ఖాతాలో చేరనున్నాయి. సెప్టెంబర్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడ మహిళలు క్రీడల్లో పాల్గొనడాన్ని, ఉద్యోగానికి వెళ్లడాన్ని వారు నిషేధించారు.
అప్ఘనిస్తాన్‌కు ఇప్పటివరకూ మహిళా టీమ్ లేదు
ఆప్ఘనిస్తాన్ సహా ప్రపంచ వ్యాప్తంగా పురుషుల, మహిళల క్రికెట్ వృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. మహిళలు, బాలికల పరిస్థితులు మెరుగవుతాయన్న ఉద్దేశంతో ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతూనేఉంటామన్నారు. దీంతో ఆస్ట్రేలియాకు ఆప్ఘానిస్తాన్ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై మార్చిలో జరిగే సమావేశంలో చర్చిస్తామని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డిస్ వెల్లడించారు. ఐసీసీలో పూర్తి స్థాయి సభ్య దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఇప్పటి వరకూ మహిళల టీమ్ లేదు. శనివారం నుంచి ప్రారంభం కాబోయే మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ లేని ఏకైక సభ్యదేశం ఆఫ్ఘనిస్థానే కావడం విశేషం