T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,శ్రీలంక వేదికగా 2026లో జరిగే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అంతేకాక, క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మిచెల్ మార్ష్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో తమ జట్టును ప్రకటించింది. ఆ జట్టు విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు సభ్యుడు కమిన్స్, వెన్నెముక గాయంతో నొప్పి నుంచి కోలుకుంటున్నాడు. అతను ఇటీవల అడిలైడ్‌లో జరిగిన మూడో యాషెస్ టెస్ట్‌లో మాత్రమే ఆడగలిగాడు. ఈ నెల చివర్లో అతనికి స్కాన్ నిర్వహించనున్నారు. దాని ఫలితం ఆధారంగా తుది జట్టులో అతడు భాగమవుతాడో.. లేదో తెలుస్తుంది.
వివరాలు
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
అయితే, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బేలీ మాట్లాడుతూ, "కమిన్స్, హేజిల్‌వుడ్, డేవిడ్‌లు పూర్తిగా కోలుకుంటున్నారు. ఈ ముగ్గురు టోర్నమెంట్ సమయంలో పూర్తి ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది" అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో డేవిడ్ హామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడగా, హేజిల్‌వుడ్ కూడా హామ్‌స్ట్రింగ్ గాయానికి తరువాత యాషెస్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు ఇదే.. :మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానెల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ట్వీట్
Australia has gone spin-heavy for the ICC Men's T20 World Cup.
— cricket.com.au (@cricketcomau) January 1, 2026
Break down the squad: https://t.co/3o6P5YgvHz pic.twitter.com/DtSdgZ0VWV