Page Loader
పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన బెత్ మూనీ

పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిడ్నీలోని నార్త్ సిడ్నీ ఓవల్‌లో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు, పాకిస్తాన్ మహిళల జట్టును ఓడించారు. బెత్ మూనీ 133 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 336/9 స్కోరు చేసింది. చేధనకు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు బ్యాటింగ్‌లో తడబడటంతో 235/7 స్కోర్ చేసి ఓటమి పాలైంది. మూనీ కేవలం 105 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. ఆమె 126.67 వద్ద సగటుతో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగింది. దీంతో మూనీ వన్డేలో మూడో సెంచరీ సాధించింది. వన్డేల్లో 52.45 సగటుతో 1,941 పరుగులు చేసింది. 1,900కు పైగా పరుగులు చేసిన 10వ ఆసీస్ మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె నిలిచింది.

ఆస్ట్రేలియా

పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన బెత్‌మూనీ

పాకిస్తాన్ మహిళల జట్టులో తన 8 వన్డే అడుతున్న మూనీ 69.75 సగటుతో 279 పరుగులు చేసింది. పాకిస్తాన్ మహిళల జట్టుతో మొదటిసారిగా సెంచరీ సాధించింది. మునుపటి వన్డేలో అర్ధసెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళలు మూనీ, మెగ్ లానింగ్‌లు 2వ వికెట్‌కు 160 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో జట్టు భారీ స్కోరు చేసింది. మిడిల్-ఆర్డర్ బ్యాటర్ల రాణించడంతో 336/9 స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా మహిళలు వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశారు. పాకిస్థాన్ మహిళా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరును సాధించలేకపోవడంతో పాకిస్తాన్ ఓటమి పాలైంది.