LOADING...
IND vs AUS: ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు 
ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు

IND vs AUS: ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 223 రోజుల తర్వాత భారత జెర్సీలో కనిపించనుండగా, ఫాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు మార్చి 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో వారిని చూడటం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగించగా, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రో-కోలు పూర్తిగా నిరాశపరచేశారు. రోహిత్ శర్మ క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే 8 పరుగులకే ఔట్ అయ్యాడు.జోష్ హేజిల్‌వుడ్ వేసిన నాల్గో బంతిని ఆడబోయి స్లిప్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు.

Details

మ్యాచ్ 49 ఓవర్లకు కుదింపు

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అద్భుత క్యాచ్ కారణంగా విరాట్ పెవిలియన్ చేరారు. దాంతో భారత్ రెండో వికెట్ 21 పరుగుల వద్ద కోల్పోయింది. విరాట్ అవుట్ అయ్యాక కాసేపటికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10)* కూడా పెవిలియన్ చేరారు. ఎల్లిస్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నిస్తుండగా, వికెట్ కీపర్ సూపర్ క్యాచ్‌ కారణంగా ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి అక్షర్ పటేల్ వచ్చి ఆట పునరారంభమయ్యే వరకు కొంతమేర ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆట 14 నిమిషాల్లోనే పునరారంభం అయి, మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతానికి భారత్ 11 ఓవర్లకు 35/3 వద్ద ఉంది. క్రీజ్‌లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ స్కోరును పెంచేందుకు కృషి చేస్తున్నారు.