LOADING...
IND vs AUS: నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా? 
నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా?

IND vs AUS: నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అయినా భారత్ సమర్థంగా పోరాడుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అందుకే ఈ మ్యాచ్‌లో వీరిద్దరి ఫామ్ తిరిగి రావడం జట్టు విజయానికి కీలకం కానుంది. అలాగే సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా రన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌ నుంచి దూరమవ్వడం టీమిండియాకు సానుకూల పరిణామంగా మారింది.

Details

ఈ మ్యాచులో తప్పక గెలవాల్సిందే

వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఈ టీ20 సిరీస్‌లో నిలదొక్కుకోవాలంటే ఈ మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిందే. లేదంటే సూర్య సేనపై ఒత్తిడి మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియా వైపు చూస్తే, విజయం సాధించగలమనే నమ్మకంతో జట్టు బరిలోకి దిగనుంది. చిన్న మార్పులతోనే ఆ జట్టు ఆటతీరులో సర్దుబాటు చేయనుందని సమాచారం.

Details

హేజిల్‌వుడ్‌కి విశ్రాంతి

యాషెస్ సిరీస్ దగ్గరపడుతుండటంతో హేజిల్‌వుడ్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది. దీంతో మిగతా మ్యాచ్‌ల్లోనూ అతను అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో సీన్ అబాట్‌ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే, గాయం నుంచి కోలుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఓవెన్ లేదా షార్ట్ స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈరోజు జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ పునరాగమనాన్ని సాధిస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న.