Page Loader
మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం
మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే

మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం

వ్రాసిన వారు Stalin
Feb 27, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించింది. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156పరుగులు చేశారు. మూనీ అజేయంగా హాఫ్ సెంచరీ(74)తో దక్షిణాఫ్రికా జట్టుకు 156 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా 20ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్యంగాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికాను తడబడింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వోల్వార్డ్ 48బంతుల్లో 61 పరుగులు చేసినా, ఆమె పోరాటం వృథా అయిపోయింది.

ప్రపంచకప్‌

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ లానింగ్ రికార్టు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇప్పటి వరకు 8 ప్రపంచకప్‌లు జరగ్గా ఏడుసార్లు ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరింది. అందులో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గణాంకాలు చాలు ఆస్ట్రేలియా మహిళల జట్టు ఎంత పటిష్టమైనదో చెప్పడానికి. 2016 ఎడిషన్‌లో మినహా ప్రతి ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాదే విజయం. 2016లో వెస్టిండీస్ ట్రోఫీని కైవసం చేసుకోగా, ఆసీస్ రన్నరప్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ లానింగ్ రికార్టు సృష్టించారు. 100టీ20లకు నాయకత్వం వహించిన మొట్టమొదటి ప్లేయర్(పురుషుడు లేదా స్త్రీ)గా ఘనత సాధించారు. పురుషుల క్రికెట్లో కూడా 100టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లు లేరు.