Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి. భారత్‌ను స్వల్ప తేడాతో ఓడించి ఆసీస్ ఫైనల్‌కు చేరింది. అలాగే దుర్భేధ్యమైన ఇంగ్లండ్ టీమ్‌ను ఇంటికి పంపించి తుది పోరుకు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు మంచి రికార్టు ఉంది. ఇప్పటి వరకు ఏడు ప్రపంచకప్‌లు జరగ్గా ఆరుసార్లు ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరింది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అటు పురుషుల జట్టు కానీ, ఇటు మహిళల జట్టు కానీ వరల్ట్ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల అంచనాలు ఇలా ఉన్నాయి
ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాసెన్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్. దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, సునే లూస్ (కెప్టెన్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అన్నెకే బోష్, సినాలో జాఫ్తా (వికెట్-కీపర్), షబ్నిమ్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో ఎంలాబా. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ 176పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణి. ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ (171పరుగులు) మూడోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 2010, 2012, 2014, 2018, 2020లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.