IND vs AUS : నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా షాక్.. స్టార్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టీ20లో (IND vs AUS) భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో నాలుగో టీ20 మ్యాచ్ నవంబర్ 6వ తేదీ గురువారం గోల్డ్‌కోస్ట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను (Travis Head) టీ20 స్క్వాడ్ నుంచి విడుదల చేసింది.
Details
ఆస్ట్రేలియా జట్టులో చిన్నమార్పులు
ఇంగ్లాండ్‌తో జరగబోయే యాషెస్ సిరీస్ (Ashes Series) వ్యూహాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా, ఆ సిరీస్ తొలి టెస్టులో ఆడే ఆటగాళ్లు అందరూ ముందుగా షెఫీల్డ్ షీల్డ్ (Sheffield Shield)లో పాల్గొనాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ట్రావిస్ హెడ్‌ను భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి తప్పించి, దేశీయ టోర్నీలో పాల్గొనడానికి విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టులో చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు గోల్డ్‌కోస్ట్ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్‌పై ఆసక్తి కేంద్రీకృతమైంది.