AUS vs SA: సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 134 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. లంకపై సెంచరీ బాదిన క్వింటన్ డికాక్(109) ఈ మ్యాచులోనూ శతకంతో విజృంభించాడు. ఐడెన్ మార్క్రమ్ 56 హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లక్ష్య చేధనకు దిగిన కంగారులు 177 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 3, జాన్సెన్, మహరాజ్, షంసీ తలా రెండో వికెట్లతో సత్తా చాటారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా, సౌతాఫ్రికా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.