WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇటీవల భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను 0-2తో ఆస్ట్రేలియా ఓడిపోయింది. టీమిండియా సిరీస్ మధ్యలో వెళ్లిపోయిన పాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరాడు. కెప్టెన్ గా కూడా అతడే వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా టెస్టు జట్టులోని సభ్యులు
ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, మార్కస్ హారిస్ టెస్టులో జట్టులో ఎంపికయ్యారు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ తొలిసారి టెస్టు జట్టు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా టీమిండితో చివరి రెండు టెస్టులకు దూరమైన డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులో స్థానం సంపాదించారు. టెస్టు జట్టులో నలుగురు పేసర్లకు ఎంపిక చేశారు. స్పిన్ విభాగంలో నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ టెస్టు జట్టులో కీలకంగా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్మిత్ (వైస్ కెప్టెన్), వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, గ్రీన్, మార్కస్ హారిస్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఖవాజా, లాబుషేన్, లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్.