 
                                                                                AUS vs IND: రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్
ఈ వార్తాకథనం ఏంటి
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కంగారూలు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందారు. 126 పరుగుల లక్ష్యాన్నిఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ప్రారంభం నుంచే దూకుడు చూపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వేగంగా రాణించాడు. అతడు ఔట్ కావడానికి ముందు రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 7.6 ఓవర్లో కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మైదానాన్ని వీడాడు.
వివరాలు
దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్
మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28; 15 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులో ఉన్నంత వరకు దూకుడుగా ఆడాడు. జోస్ ఇంగ్లిస్ (20; 20 బంతుల్లో, 1 ఫోర్) కూడా తన వంతు సహకారం అందించాడు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన హర్షిత్ రాణా బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆఖర్లో భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసుకున్నప్పటికీ ఆసీస్‌ను మాత్రం నిలువరించలేకపోయారు.