Team India Schedule 2025: ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2008 నుంచి ఆస్ట్రేలియా నేలపై టీమిండియా ఒక్కసారి కూడా పొట్టి సిరీస్‌ను కోల్పోలేదు. ఆ పరంపరను ఈ సారి కూడా కొనసాగించింది. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేడు స్వదేశానికి చేరుకోనున్నారు.
Details
విశ్రాంతి లేకుండానే మరో సిరీస్
ఆస్ట్రేలియా పర్యటన పూర్తయిన వెంటనే భారత జట్టుకు పెద్ద విరామం దొరకడం లేదు. దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వారం రోజులు కూడా సమయం లేకపోవడంతో టీమిండియాకు విశ్రాంతి లేకుండానే మరో సిరీస్ మొదలవుతుంది. రెండో టెస్ట్ నవంబర్ 22న గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరగనుంది. వన్డే సిరీస్ నవంబర్ 30న రాంచీ వేదికగా మొదలవుతుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో, మూడో మరియు చివరి వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.
Details
డిసెంబర్ 9న టీ20 సిరీస్
తదుపరి టీ20 సిరీస్ డిసెంబర్ 9న కటక్‌లో ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగతా పోటీలు వరుసగా డిసెంబర్ 11న ముల్లన్‌పూర్, డిసెంబర్ 14న ధర్మశాల, డిసెంబర్ 17న లక్నో, డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికలపై జరగనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. వన్డే, టీ20 సిరీస్‌లకు మాత్రం ఇంకా జట్ల వివరాలు వెలువడలేదు. టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నిహమ్ రాజ్ పట్రాహ్, జస్ప్రీత్ కుమార్ పట్రాహ్,కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్.
Details
దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు ఇదే
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రూయిస్, టోనీ డి జోర్జి, జుబైర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్. దక్షిణాఫ్రికా పర్యటన పూర్తి షెడ్యూల్ 1వ టెస్ట్:నవంబర్ 14-18,కోల్‌కతా 2వ టెస్ట్:నవంబర్ 22-26,గౌహతి 1వ వన్డే: నవంబర్ 30,రాంచీ 2వ వన్డే: డిసెంబర్ 3, రాయ్‌పూర్ 3వ వన్డే: డిసెంబర్ 6, విశాఖపట్నం 1వ టీ20: డిసెంబర్ 9, కటక్ 2వ టీ20: డిసెంబర్ 11, ముల్లన్‌పూర్ 3వ టీ20: డిసెంబర్ 14, ధర్మశాల 4వ టీ20: డిసెంబర్ 17, లక్నో 5వ టీ20: డిసెంబర్ 19, అహ్మదాబాద్