ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు.. ప్రపంచకప్ హిస్టరీలోనే అతితక్కువ బంతుల్లోనే ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.
చెన్నైలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేయడం ద్వారా స్టార్క్ ఈ ఫీట్ ను చేరుకున్నాడు.
మరోవైపు వన్డే ప్రపంచ కప్‌లో అతి తక్కువ బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా స్టార్క్ పేరుగాంచాడు.కేవలం 941 బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ 1187 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆదివారం ఆసీస్-భారత్ మ్యాచుతో మలింగ రికార్డును స్టార్క్ కొల్లగొట్టాడు.
ఇప్పటివరకు 112 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మొత్తంగా 221 వికెట్లను నేలకూల్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అతితక్కువ బంతుల్లోనే 50 వికెట్లు కూల్చిన మిచెల్ స్టార్క్
Mitchell Starc becomes the QUICKEST to get to 50 World Cup wickets 🤯
— ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2023
Ishan Kishan falls for a first-ball duck 🦆 https://t.co/wnv4HTdN5F #INDvAUS #CWC23 pic.twitter.com/xqhE5opQWL