ప్రపంచకప్-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే
ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 8న తన తొలి పోరాటం ఆస్ట్రేలియాతో ఆరంభించనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దం నాలుగు వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడిన ఐదో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. దీంతో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ధోని దిగ్గజాల సరసన కోహ్లీ నిలవనున్నాడు. 2011, 2015, 2019 వన్డే మెగా టోర్నీలో భారత్ తరఫున విరాట్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ జాబితాలో అత్యధిక వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ (6) అగ్రస్థానంలో ఉన్నాడు.
64.28 సగటుతో 2,700 పరుగులు చేసిన కోహ్లీ
1. ప్రపంచ కప్ ఈవెంట్లో 3,000 పరుగులు కోహీ మరో 300 పరుగులు చేస్తే, వన్డే ప్రపంచ కప్‌లో 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి నిలవనున్నారు. నాలుగు ప్రపంచ కప్ టోర్నీల్లో 66మ్యాచులు ఆడిన కోహ్లీ 64.28సగటుతో 2,700 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలున్నాయి. ఈ జాబితాలో కోహ్లీ కంటే సచిన్ (2,719), జయవర్ధనే(2,858), కుమార సంగక్కర (2,876), క్రిస్ గేల్ (2,942) మాత్రమే ముందున్నారు. 2. ఛేజింగ్ లో 7,500 పరుగులు ఈ తరంలో వన్జే చేజింగ్‌లో కోహ్లిదే అసాధారణమైన రికార్డు. రెండో ఇన్సింగ్‌లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 64.13 సగటుతో దాదాపుగా 7,440 పరుగులు చేశాడు.
మరో 70 పరుగులు చేస్తే శ్రీలంకపై 4000 రన్స్
చేజింగ్‌లో 7,500 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీ మరో 60 పరుగులు అవరసం. ఈ జాబితాలో సచిన్ (8,720) తర్వాత రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు రెండో స్థానంలో ఉన్నాడు. చేజింగ్ లో 18కిపైగా సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ కోహ్లీ మాత్రమే. 3. శ్రీలంకపై 4,000 రన్స్ శ్రీలంకపై 4,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీకి మరో 70 పరుగులు అవసరం . టెండూల్కర్ (5,108) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా కోహ్లీ అవతరించనున్నాడు. 34 ఏళ్ల విరాట్, ప్రస్తుతం శ్రీలంకపై సగటున 64.42తో 3,930 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 17 అర్థ సెంచరీలున్నాయి.
మరో 8 సిక్సులు బాదితే 150 సిక్సుల రికార్డు
4. 150 సిక్సర్ల మాస్టర్ కోహ్లి వన్డేల్లో 150 సిక్సర్లు పూర్తి చేసేందుకు కోహ్లీ కేవలం 8 సిక్సుల దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (292), ఎంఎస్ ధోని (229), సచిన్ (195), గంగూలీ(190), యువరాజ్ సింగ్ (155) తర్వాత ఈ మైలురాయిని అందుకోనున్న ఆరో భారత ఆటగాడిగా కోహ్లీ సంచలనం సృష్టించనున్నాడు. 5. వన్డేల్లో 150 క్యాచ్‌లు ఇటు బ్యాట్ తో పాటు తన ఫీల్డింగ్ నైపుణ్యంతోనూ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మేరకు వన్డేల్లో భారత్ తరఫున 150 క్యాచ్‌లు పూర్తి చేసేందుకు కేవలం 5 క్యాచ్ ల దూరంలో ఉన్నాడు. మహేల జయవర్ధనే(212), పాంటింగ్(160), అజారుద్దీన్(156) తర్వాత 150 క్యాచ్‌లు సాధించిన నాల్గో ఆటగాడిగా నిలనున్నాడు.