అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా
పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత పోరాటం చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31బంతుల్లో 65; 3ఫోర్లు, 6 సిక్సర్లు) కొట్టి అందరి మనసులను దోచుకున్నారు. శ్రీలంక కెప్టెన్ షనక, అక్షర్‌ను ఛాతిపై తట్టి అభినందించాడు. 207 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ సగం ఓవర్లయ్యేసరికి 64. అప్పటికే సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మాత్రమే క్రీజులో ఉన్నాడు. ఈ స్థితిలో భారత్ ఓటమి సంగతి అటుంచితే .. టీమ్ ఇండియా గౌరవప్రదమైనా స్కోరు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల మోతతో స్కోరును పరుగులు పెట్టించారు.
20 బంతుల్లో హాఫ్ సెంచరీ
సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో శ్రీలంక బౌలర్లకు వణుకు పుట్టించాడు. అయితే భారత్ ఓటమి ఖాయం అనుకున్న దశలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ప్రత్యర్ధులపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అనంతరం వారి చేత శభాష్ అనిపించుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ చేసి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా తరుపున 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.