LOADING...
Ayush Mhatre: అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే
అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే

Ayush Mhatre: అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భారత యువ జట్టుకు ఆయుష్‌ మాత్రే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఎంపిక చేశారు. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి కూడా చోటు లభించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. అయిదుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌ ఈసారి గ్రూప్‌-ఎలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా జట్లతో తలపడనుంది.

Details

జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం

జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తన ప్రచారాన్ని ఆరంభించనుంది. అనంతరం 17న బంగ్లాదేశ్‌తో, 24న న్యూజిలాండ్‌తో గ్రూప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు భాగంగా దక్షిణాఫ్రికాలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కూ సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు వైభవ్‌ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తున్నారు.

Details

అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత జట్టు 

ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, ఆరోన్‌ జార్జ్, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు, హర్‌వన్ష్‌ సింగ్, అంబరీష్ కనిష్క్‌ చౌహాన్, ఖిలాన్‌ పటేల్, మహ్మద్‌ ఇనాన్, హెనిల్‌ పటేల్, దీపేశ్, కృష్ణన్‌ కుమార్, ఉద్ధవ్‌ మోహన్‌. దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్ గా సూర్యవంశీ వైభవ్‌ సూర్యవంశీ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్, అభిజ్ఞాన్, హర్‌వన్ష్, అంబరీష్, కనిష్క్, ఖిలాన్‌ పటేల్, ఇనాన్, హెనిల్‌ పటేల్, దీపేశ్, కృష్ణన్‌ కుమార్, ఉద్ధవ్‌ మోహన్, యువరాజ్‌ గోహిల్, రాహుల్‌ కుమార్‌.

Advertisement