World Cup 2023 : డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై మౌనం వీడన బాబర్ ఆజం
మరో వారం రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ కానుంది. ఇప్పటికే అప్గనిస్థాన్, న్యూజిలాండ్ జట్లు భారత్ కు రాగా, నేడు పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తికర అంశాలను మాట్లాడారు. ముఖ్యంగా ఆసియా కప్ తర్వాత పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూమం వివాదంపై బాబార్ అజామ్ మౌనం వీడారు. ఆసియా కప్ తర్వాత జట్టు ప్రదర్శన నిరాశపరిచన మాట వాస్తవమేనని, అయితే పాక్ ఆటగాళ్లు ఒకరితో ఒకరు గొడవపడ్డారనేది కేవలం ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పారు.
ఫేక్ వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది
మీడియా తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ఆటగాళ్లందరూ ఒకరికొకరు ప్రేమతో కుటుంబంలా ఉంటారని బాబార్ ఆజం పేర్కొన్నారు. ఇక వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు టాప్-4లో కనిపిస్తుందా అనే ప్రశ్నకు బాబర్ సమాధానమిచ్చాడు. టాప్ ఫోర్ చాలా దూరం ఉందని, అయితే తాము ప్రపంచ కప్ గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు మహ్మద్ నవాజ్, ఆఘా సల్మాన్ మాత్రమే భారత్‌లో ఆడారు. బాబర్ గాయం కారణంగా 2016లో టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు రాలేకపోయాడు. ఇక కెప్టెన్ గా బాబర్ కు ఇదే మొదటి భారత పర్యటన కావడం విశేషం.