Page Loader
Siraj - Babar Azam: బెయిల్స్ మార్చే టెక్నిక్.. సిరాజ్‌ను అనుసరించిన పాక్ కెప్టెన్
బెయిల్స్ మార్చే టెక్నిక్.. సిరాజ్‌ను అనుసరించిన పాక్ కెప్టెన్

Siraj - Babar Azam: బెయిల్స్ మార్చే టెక్నిక్.. సిరాజ్‌ను అనుసరించిన పాక్ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టంప్స్‌పై బెయిల్స్‌ను అటు ఇటూ మార్చడాన్ని కొంతమంది ప్లేయర్లు ఒక టెక్నిక్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది వికెట్‌ను సాధించడంలో సహాయపడుతుందనే విశ్వాసంతో మహ్మద్ సిరాజ్‌ ఈ టెక్నిక్‌ను భారత్-ఆస్ట్రేలియా పర్యటనలో రెండుసార్లు ఉపయోగించి విజయాన్ని సాధించాడు. అతను ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు బెయిల్స్‌ను అటు ఇటూ మార్చాడు. దీని ఫలితంగా లబుషేన్‌ ఏకాగ్రతను కోల్పోయి ఔటయ్యాడు. ఈ ఘటనపై ఆసీస్‌ మాజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెయిల్స్‌తో బ్యాటర్‌కు ఆడటం అనైతికమని వ్యాఖ్యానించారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా బెయిల్స్‌ను మార్చే ప్రయత్నం చేశాడు.

Details

మొదటిసారి అనుసరించిన ఇంగ్లండ్ మాజీ పేసర్

కానీ ఈ ప్రయత్నం ఫలించలేదు. సెంచూరియన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 211 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా 301 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 237 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బాబర్ అజామ్‌ కూడా స్టంప్స్‌పై బెయిల్స్‌ను మార్చారు. ఈ బెయిల్స్ మార్పు టెక్నిక్‌ను మొదటిసారి ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆచరించారు. అతనికి అదృష్టం కలిసొస్తుందని భావించి ఇలా చేసేవాడు. ప్రస్తుతం సిరాజ్‌ ఆసీస్‌పై ఈ టెక్నిక్‌ను ఉపయోగించి విజయాన్ని సాధించినట్లుగా, ఇప్పుడు బాబర్‌ అజామ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.