Page Loader
BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్
రేపు ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది

BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. తాజాగా టీ20 సిరీస్ ని కూడా 2-0తో కైవసం చేసుకుంది. మార్చి 31న ఐర్లాండ్‌తో జరిగే మూడో టీ20ని గెలిచి టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని బంగ్లాదేశ్ పట్టుదలతో ఉంది. ఎలాగైనా చివరి టీ20 గెలిచి బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఐర్లాండ్ భావిస్తోంది. మూడో టీ20 చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. వరుసగా రెండు టీ20లు గెలిచి ఊపుమీద ఉన్న బంగ్లా.. మూడో టీ20ల్లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. మ్యాచ్ ఫ్యాన్ కోడ్ యాప్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కానుంది.

ఐర్లాండ్

ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్‌కు మంచి రికార్డు

ఇప్పటివరకూ రెండు జట్లు ఏడు టీ20 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఐర్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ రద్దు అయింది. బంగ్లాదేశ్ జట్టు : లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), రోనీ తాలూక్దార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మద్, హసన్ మహ్మద్, ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, లోర్కాన్ టక్కర్ (వికెట్-కీపర్), హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్, ఫియోన్ హ్యాండ్, గ్రాహం హ్యూమ్, బెంజమిన్ వైట్