Page Loader
భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం
ఆగస్టులో ఐర్లాండ్‌లో పర్యటించనున్న టీమిండియా

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2023
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నట్లు క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు మలాహిడ్‌లో జరగనున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా జట్టు గతేడాది ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్ ఆడి 2-0 తో నెగ్గిన విషయం తెలిసిందే.

ఐర్లాండ్

ప్రపంచకప్ సూపర్ లీగ్ సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యం

భారత్‌తో ఆడేందుకు ముందు ఐర్లాండ్ బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల ప్రపంచకప్ సూపర్ లీగ్ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. మే నెలలో చెమ్స్‌ఫోర్డ్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే 2023 క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై ఐర్లాండ్ 3-0తో గెలవకపోతే, 50 ఓవర్ల ప్రపంచకప్ క్వాలిఫైయర్ కోసం జూన్‌లో జింబాబ్వేకు వెళ్లాల్సి ఉంటుంది.