బంగ్లాదేశ్ చేతిలో ఐర్లాండ్ చిత్తు.. బంగ్లాదే వన్డే సిరీస్
ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండపై సిరీస్ క్వీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే ఊపుతో ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 10 వికెట్లతో ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. పేసర్ హసన్ మహమూద్(5/32)తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట ఐర్లాండ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో పరుగుల పరంగా అతిపెద్ద(183) విజయాన్ని నమోదు చేసిన బంగ్లా.. వన్డే క్రికెట్ చరిత్రలో మొదటిసారి పది వికెట్ల తేడాతో గెలుపొందింది.
విజృంభించిన బంగ్లా బౌలర్లు
బంగ్లాదేశ్ కెప్టెన్ (41 నాటౌట్; 41 బంతుల్లో 5×4, 2×6), లిటన్ దాస్ (50 నాటౌట్; 38 బంతుల్లో 10×4) అజేయంగా నిలిచారు. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. హసన్ మహమూద్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', ముష్ఫికర్ రహీమ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్‌కు తోడు తస్కిన్ అహ్మద్ (3/26), ఇబాదత్ హొస్సేన్ (2/29) సత్తాచాటారు