Page Loader
అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్
అభిమానిని క్యాప్‌తో కొట్టిన షకీబ్ అల్ హసన్

అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2023
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు. తాజాగా మరోసారి వివాదంలో షకీబ్ చిక్కుకున్నాడు. ఓ ఈ వెంట్లో షకీబ్ అల్ హసన్ అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా తన కోపాన్ని అదుపు చేసుకోకుండా అవేశంతో అభిమానిని కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. షకీబ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంతో కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో షకీబ్ అననుకూల నిర్ణయం కోసం అంపైర్‌లతో యానిమేషన్ పద్ధతిలో గొడవ పడ్డాడు.

షకీబ్‌

షకీబ్‌కు వ్యతిరేకంగా కామెంట్లు

బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం చటోగ్రామ్‌లో ఉన్నారు. అక్కడ స్టార్ క్రికెటర్‌ను చూడటానికి పెద్ద మొత్తంలో అభిమానులు వచ్చారు. దీంతో గందరగోళం నడుమ షకీబ్ తన సహనాన్ని కోల్పోయి అభిమానిని క్యాప్‌తో కొట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో షకీబ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి T20Iలో బంగ్లాదేశ్ తరఫున షకీబ్ చివరిసారిగా కనిపించిన విషయం తెలిసిందే.