BAN vs ENG: అర్ధ సెంచరీతో చెలరేగిన షకీబుల్ హసన్
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. షకీబ్ 71 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో తన కెరీర్‌లో వన్డేలో 52 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిట్టన్ దాస్ (0) నిరాశ పరిచారు. నజ్ముల్ హొస్సేన్ శాంటో (53), ముష్ఫికర్ రహీమ్ (70) కీలక భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వారిద్దరూ ఔటైన తర్వాత షకీబ్ ఒంటరిగా ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాది స్కోరును పరిగెత్తించాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్న షకీబ్ మాత్రం విరోచితంగా పోరాడాడు.
షకీబుల్ సాధించిన రికార్డులివే
వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ షకీబుల్ హసన్ నిలిచాడు. దీంతో 246 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌటైంది. బంగ్లాదేశ్ తరపున వన్డేలో 6,976 పరుగులు చేశాడు, తమీమ్ ఇక్బాల్ 8,143 పరుగులు చేసి అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. గత ఏడాది భారత సిరీస్‌లో షకీబ్ వన్డేలో 3,000 పరుగులు, 150 వికెట్లు తీసిన ఏకైక ఆల్ రౌండర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. షకీబ్ స్వదేశంలో 3,190 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలున్నాయి