LOADING...
Womens T20 World Cup: బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో సీనియర్లకే చోటు.. ఇద్దరు పేసర్లతో బరిలోకి!
బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో సీనియర్లకే చోటు.. ఇద్దరు పేసర్లతో బరిలోకి!

Womens T20 World Cup: బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో సీనియర్లకే చోటు.. ఇద్దరు పేసర్లతో బరిలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు తమ స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్‌గా నిగర్ సుల్తానా నేతృత్వంలో 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేశారు. గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లకు ఈసారి కూడా చోటు దక్కగా, సీనియర్ బ్యాటర్ షర్మీన్ సుల్తానా స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ తేజ్ నెహర్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈసారి ఐసీసీ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు కేవలం ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. ఈ నిర్ణయంపై చీఫ్ సెలెక్టర్ సజాద్ అహ్మద్ వివరణ ఇచ్చారు.

వివరాలు

పేసర్లు త్వరగా గాయపడే అవకాశం

పేసర్లు త్వరగా గాయపడే అవకాశం ఉండటంతో పాటు, ఇంగ్లండ్‌లోని పిచ్‌లు ఉపఖండం తరహాలో స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని గుర్తించి ఎక్కువ మంది స్పిన్నర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే షర్మీన్ సుల్తానా స్థానంలో తేజ్ నెహర్‌ను ఎంపిక చేయడంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. నెహర్ ఓపెనింగ్ నుంచి ఆరో స్థానంలోనూ ఆడగల బహుముఖ ఆటగారని, డెత్ ఓవర్లలో కూడా కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిపోవడం జట్టు ప్రధాన సమస్యగా మారిందని సెలెక్టర్ పేర్కొన్నారు.

వివరాలు

జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్

ఈ సమస్యను ఒక్కరోజులో పరిష్కరించలేమని, కానీ దానిపై పని చేస్తున్నామని తెలిపారు. జట్టు టాప్ ఆర్డర్‌లో నిగర్ సుల్తానా, షర్మీన్ అక్తర్, శోభనా మొస్త్రే, తేజ్ నెహర్ కీలక పాత్ర పోషించనున్నారు. గత వన్డే వరల్డ్‌కప్‌లో మెరిసిన యువ పేసర్ మరుఫా అక్తర్‌తో పాటు ఫరిహా ఇస్లాం కొత్త బంతిని పంచుకోనున్నారు. ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌తో త్రైకోణ సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

Advertisement