Page Loader
IND Vs BAN: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

IND Vs BAN: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇక ఆక్టోబర్ 6 నుంచి భారత్‌తో టీ20 మ్యాచులను ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లా 15 మంది సభ్యులతో కూడిన టీ20 జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ మెహిదీ హసన్ కూడా సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ జట్టుకు నజ్ముల్ హొస్సేన్ సారథిగా ఎంపికయ్యాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ పర్వేజ్ హొసేన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రకీబుల్ హసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హన్ టీ20 రిటైర్మెంట్ ప్రకటించారు.

Details

టీ20 సిరీస్ కోసం ఎంపికైన బంగ్లాదేశ్ జట్టు ఇదే 

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మద్ ఉల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షాక్ మహిద్ హస్సాన్, షక్ మహిద్ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్. భారత జట్టులోని సభ్యులు సూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రింకు సింగ్, హార్దిక్‌ పాండ్య, రియాన్‌ పరాగ్, నితీశ్ కుమార్‌, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్‌), అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.