Page Loader
Antim Panghal : భారత రెజ్లర్‌పై మూడేళ్లు నిషేదం
భారత రెజ్లర్‌పై మూడేళ్లు నిషేదం

Antim Panghal : భారత రెజ్లర్‌పై మూడేళ్లు నిషేదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2024
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌కు భారత ఒలింపిక్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో మూడేళ్ల పాటు నిషేధం విధించింది. అంతిమ్‌తో పాటు ఆమె సహాయక సిబ్బందిని గురువారమే స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించింది. వీరంతా నిబంధనలను ఉల్లంఘించారని ఫ్రెంచి అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది

Details

అక్రిడిటేషన్ రద్దు

అంతిమ్ అమె సోదరిని ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌లోకి అక్రిడిటేషన్‌తో పంపడమే ఇందుకు కారణమని తెలిసింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు తన సోదరి నిశాకు చెప్పింది. వాటిన్నింటిని తీసుకురావాలని అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులు తీసుకొస్తుండగా సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం అమె నుంచి ఓ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అంతిమ్ ను కూడా పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దానిని రద్దు చేశారు.