తదుపరి వార్తా కథనం
IND vs SA: బాష్ పోరాటం వృథా.. తొలి వన్డేలో టీమిండియా విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 30, 2025
10:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 135 పరుగులతో మెరిశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 60, రోహిత్ శర్మ 57 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ అందించారు. అనంతరం 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకే ఆలౌట్ అయింది. వరుసగా వికెట్లు కోల్పోయినా చివరి వరకు పోరాడింది.
Details
నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్
మాథ్యూ 72, యాన్సన్ 70, బాష్ 67 పరుగులతో జట్టు కోసం మంచి ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దూకుడు చూపించాడు. హర్షిత్ రాణా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీసి విజయంలో పాత్ర వహించారు.